ఏటీఏం యూజర్లకు ఆర్బీఐ షాక్.. రూ.5వేలే విత్ డ్రా.. పెరిగితే ఛార్జీలు తప్పవ్!
ఆర్బీఐ ఏటీఏం వినియోగదారులకు షాకిచ్చింది. కరోనా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనేందుకు గాను ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఏటీఎం ఛార్జీలను మరింత పెంచే యోచనలో ఆర్బీఐ ఉన్నట్లు తెలుస్తోంది. ఒక ఏటీఎం ట్రాన్సక్షన్‌లో ఐదు వేల రూపాయలు మాత్రమే విత్‌డ్రాకు అవకాశం ఇచ్చేలా నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
ఒకవేళ ఇదే అమల్లోకి వస్తే అంతకు మించి విత్ డ్రా చేసుకుంటే అదనపు ఛార్జీలు పడే అవకాశం ఉంది. ఈ మేరకు ఇటీవల ఆర్బీఐ ఏర్పాటు చేసిన కమిటీ పలు కీలక సంస్కరణలను ప్రతిపాదించింది. పలు రకాల ఛార్జీలు పెంచుతూ కమిటీ నివేదికను రూపొందించింది. ఏటీఎంలల్లో జరిపే అన్ని లావాదేవీలపై ఇంటర్ ఛేంజ్ ఛార్జీలను పెంచాలని సూచించినట్టు తెలుస్తోంది.
దేశవ్యాప్తంగా అన్ని ఏటీఎంలకు ఇది వర్తించేలా చేయాలని ఆర్బీఐని కోరింది. అలాగే 10 లక్షల జనాభా ఉన్న ప్రాంతాల్లో ఏటీఎం చార్జీలను 24శాతం పెంచాలని నివేదికలో పేర్కొంది. ఈ నివేదికలోని అంశాలను ఆర్బీఐ అమలు చేస్తే.. ఏటీఎం యూజర్లపై మరింత భారం పడే అవకాశం ఉంది.