గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 2 నవంబరు 2021 (18:47 IST)

దేశంలోనే అతిపెద్ద ఓపెన్ ఎయిర్ థియేటర్.. ముంబైలో ప్రారంభం

Open Air Roof Top Theatre
తొలిసారి దేశంలో అతిపెద్ద ఓపెన్ ఎయిర్ థియేటర్ ముంబైలో ప్రారంభం కాబోతోంది. రూఫ్-టాప్ థియేటర్ అయిన దీంట్లో కారులో కూర్చునే సినిమాను వీక్షించొచ్చని రిలయన్స్ రిటైల్ తెలిపింది.

ముంబైలోని జియో వరల్డ్ డ్రైవ్ షాపింగ్ మాల్‌లో ఈ నెల 5న దీనిని ప్రారంభిస్తున్నట్టు పేర్కొంది. పీవీఆర్ సినిమాస్ ఈ సినిమా హాల్‌ను నిర్వహిస్తుంది. అతిపెద్ద స్క్రీన్ కలిగిన ఈ థియేటర్ 290 కార్ల సామర్థ్యం కలిగి ఉంది.  
 
వాణిజ్య రాజధాని అయిన ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో 17.5 ఎకరాల విస్తీర్ణంలో జియో వరల్డ్ డ్రైవ్ ఉంది. ఇందులో దేశీయ, అంతర్జాతీయ ప్రీమియం బ్రాండ్లు మాత్రమే లభ్యమవుతాయి.

ఈ సందర్భంగా రిలయన్స్ రిటైల్ డైరెక్టర్ ఇషా అంబానీ మాట్లాడుతూ.. ఆధునిక వినియోగదారుల షాపింగ్‌ను మరింత అద్భుతమైన అనుభవంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యం నుంచే జియో వరల్డ్ పుట్టుకొచ్చిందని చెప్పారు.