శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 22 సెప్టెంబరు 2021 (18:43 IST)

ఏపీలోని గిరిజన గ్రామాలకు డిజిటల్ విప్లవం_దాదాపు 1529 టెలికాం టవర్లను?

భారతదేశంలో టెలికాం రంగంలో రూపురేఖలను మార్చిన డిజిటల్ విప్లవం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని గిరిజన గ్రామాలకు చేరుకుంది. ఏజెన్సీ గ్రామాల్లో ఏ చిన్నఫోన్ కాల్ చేయాలన్నా సిగ్నల్ అందక నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. 
 
ముఖ్యంగా ఆధార్, బ్యాంకింగ్ వంటి సేవల కోసం కొండలు, గుట్టలు దాటి సిగ్నల్స్ ఉన్న ప్రాంతాలక వెళ్లాల్సి వస్తోంది. దీంతో కమ్యూనికేషన్ పరంగా గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 
 
భారత్‌లో డిజిటల్ విప్లవాన్ని మరోస్థాయికి తీసుకెళ్లిన రిలయన్స్ జియో తాజాగా రాష్ట్రంలోని గిరిజన గ్రామాల్లో దాదాపు 1529 టెలికాం టవర్లను ఏర్పాటు చేసి తన మొబైల్ నెట్వర్క్ ను మరింత బలోపేతం చేసింది. దీంతో ఇప్పుడు అరకులోయ, బొర్రా గుహలు, లంబసింగి, కొత్తపల్లి జలపాతాలు ఇప్పుడు 4జి నెట్వర్క్ పరిధిలోకి వచ్చాయి.