శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 27 ఏప్రియల్ 2021 (16:08 IST)

కరోనా కష్టకాలంలో శుభవార్త.. ఎస్.బి.ఐ ఉద్యోగ జాతర

కరోనా కష్టకాలంలో ఓ శుభవార్త. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థగా ఉన్న భారతీయ స్టేట్ బ్యాంకు భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టింది. వివిధ బ్రాంచీల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఎస్‌బీఐ క్లర్క్ నోటిఫికేషన్‌‌ను విడుదల చేసింది. 
 
దీనిద్వారా మొత్తం 5 వేల ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందులో కర్క్‌ పోస్టులతోపాటు క్లరికల్‌ క్యాడర్‌లో జూనియర్‌ అసోసియేట్‌ (కస్టమర్‌ సపోర్ట్‌ అండ్‌ సేల్స్‌) పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులకు స్థానిక భాష తెలిసి ఉండాలని.. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరింది. దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 27నుంచి ప్రారంభమై మే నెల 17తో ముగుస్తుందని పేర్కొంది.
 
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోదలచిన అభ్యర్థులు ఏదైనా డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. (1993, ఏప్రిల్‌ 2 నుంచి 2021, ఏప్రిల్‌ 1 మధ్య జన్మించి ఉండాలి). ఆన్‌లైన్‌ రాతపరీక్ష. పరీక్ష ప్రిలిమినరీ, మెయిన్స్‌ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజుగా జనరల్ కేటగిరీ అభ్యర్థులు రూ.750 చెల్లించాల్సివుండగా, రిజర్వుడ్ కేటగిరికి చెందిన అభ్యర్థులకు మినహాయింపునిచ్చింది. 
 
ఈ పోస్టుల భర్తీ కోసం రెండు విధాలుగా నిర్వహిస్తారు. తొలుత ప్రిలిమినరీ పరీక్షా విధానంలో మొత్తం 100 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. ప్రశ్నలు అన్ని ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటాయి. నిర్ణీత సమయంలోపు సెక్షన్‌ను పూర్తిచేయాల్సి ఉంటుంది. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించినవారు మెయిన్స్‌ పరీక్షకు అర్హత ఉంటుంది. దీనిని 200 మార్కులకు నిర్వహిస్తారు. 
 
అప్లికేషన్‌ విధానం: ఆన్‌లైన్‌లో
దరఖాస్తులు ప్రారంభం: ఏప్రిల్‌ 27
దరఖాస్తులకు చివరితేదీ: మే 17
ప్రిలిమినరీ పరీక్ష: జూన్‌ లో
మెయిన్‌ ఎగ్జామ్‌: జూలై 31
వెబ్‌సైట్‌: https://www.sbi.co.in/careers