శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 31 అక్టోబరు 2021 (10:03 IST)

మహిళలకు శుభవార్త : తగ్గిన బంగారం ధరలు

దీపావళి పండుగ మరో నాలుగు రోజుల్లో రానుంది. ఈ పరిస్థితుల్లో ఆదివారం బంగారం ధరలు తగ్గాయి. సాధారణంగా ప్రతి రోజూ బులియన్‌ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో మార్పులు, చేర్పులు చేసుకుంటాయన్నాయి. మార్కెట్లో పసిడి, వెండి ధరలు ఒక్కోసారి పెరిగితే.. మరికొన్ని సార్లు తగ్గుముఖం పడుతుంటాయి. అందుకే కొనుగులుదారులు వాటి ధరలవైపు దృష్టిసారిస్తుంటారు. 
 
ఆదివారం బంగారం ధరలు తగ్గాయి. ప్రస్తుతం దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,740 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,740గా కొనసాగుతోంది. అయితే తులం బంగారంపై రూ.310 మేర ధర తగ్గింది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం రేట్లు పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో ఉదయం ఆరు గంటల వరకు నమోదైన రేట్ల వివరాలు ఇలా ఉన్నాయి.
 
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,100 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,740 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,740గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,060 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,160గా ఉంది.
 
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,770గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,770గా ఉంది.