సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 22 ఫిబ్రవరి 2023 (13:28 IST)

వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధరలు - వారం రోజుల్లో ఆరుసార్లు

gold
దేశంలో పసిడి ధరలు వరుసగా రెండోరోజు తగ్గాయి. గతవారం రోజులుగా తగ్గుతూ వస్తున్న వీటి ధరలు మంగళవారం కాస్త తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు బుధవారం కూడా తగ్గాయి. మొత్తంగా వారం రోజుల్లో ఆరుసార్లు ఈ ధరలు తగ్గాయి. ఈ తగ్గుదల దేశ వ్యాప్తంగా కనిపించింది. తాజాగా బుధవారం కూడా 10 గ్రాముల బంగారం ధరపై రూ.120 మేరకు తగ్గింది. 
 
దేశంలోని ప్రధాన నగరాల్లో ఈ బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలిస్తే, ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,150గా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల ధర రూ.56,880గా ఉంది. 
 
అలాగే, చెన్నైలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.52,750గా ఉండగా, 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.57,550గా ఉంది. బెంగుళూరులో 22 క్యారెట్లం పది గ్రాముల బంగారం ధర రూ.52,050గా ఉండగా, 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.56,780గా ఉంది. 
 
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ బంగారం ధరలను పరిశీలిస్తే, హైదరాబాద్, విశాఖపట్టణం, విజయవాడ నగరాల్లో కింది విధంగా ఉన్నాయి. ఈ మూడు నగరాల్లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.52,000 గాను, 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.56,730గా ఉంది. వెండి ధరల్లో మాత్రం ఎలాంటి మార్పులు లేదు.