శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 24 నవంబరు 2021 (08:48 IST)

పసిడి ప్రియులకు శుభవార్త.. రెండో రోజు కూడా తగ్గుదలే...

పసిడి ప్రియులకు శుభవార్త. రెండో రోజు కూడా బంగారం ధరలు తగ్గాయి. బుధవారం పది గ్రాముల బంగారం ధర బాగా తగ్గింది. అలాగే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.1290 మేరకు తగ్గింది. అయితే, మున్ముందు పెళ్ళిళ్ల సీజన్ ఉండటంతో ఈ ధరలు మరింతగా పెరిగే అవకాశం లేకపోలేదని వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. 
 
కాగా, బుధవారం ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే, హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,050గా ఉంటే, 24 క్యారెట్ల 10 బంగారం ధర రూ.49,150గా ఉంది.
 
అలాగే, విజయవాడ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,050గా ఉంటే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరూ.49,150గా ఉంది. విశాఖపట్టణంలో ఈ ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. 
 
మరోవైపు, దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,990గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,990గా ఉంది. అలాగే, ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,200గా ఉంటే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,500గా ఉంది.