శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 13 జూన్ 2022 (19:35 IST)

రూ. 250 కోట్ల పెట్టుబడితో తెలంగాణ లోని జహీరాబాద్‌లో 15 ఎకరాల విస్తీర్ణంలో 2-వీలర్ తయారీ కర్మాగారం

KTR
తెలంగాణలో ఒక ఎలెక్ట్రిక్ వాహనాల తయారీ కర్మాగారాన్ని నెలకొల్పడం ద్వారా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆధారిత META4 ఇండియాలో స్మార్ట్ గ్రీన్ మొబిలిటీ చొరవలలో పెట్టుబడి చేయడాన్ని ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వంతో ఇదివరకే ఒక MOU కూడా కుదుర్చుకొంది. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ లోని జహీరాబాద్ లోని జాతీయ పెట్టుబడులు, తయారీ జోన్ యందు 15 ఎకరాల రాయితీ భూమిని అప్పగిస్తుంది.

 
META4 ఈ పెట్టుబడిని Voltly Energy ద్వారా చేసింది. అది అధునాతన విద్యుత్ వాహనం 2-వీలర్ తయారీని, విద్యుదీకరణ చేయబడిన వాహనాలన్నింటికీ విద్యుత్-సమర్థవంతమైన ఛార్జింగ్ పరిష్కారాలను అందిస్తుంది. తన సుస్థిరమైన డ్రైవ్‌లో భాగంగా, తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ 2-వీలర్ తయారీ కర్మాగార విభాగమును నెలకొల్పడానికి META4 రు. 250 కోట్ల పెట్టుబడి చేస్తుంది.
 
తెలంగాణ రాష్ట్ర ఐటి- పరిశ్రమల శాఖామాత్యులు శ్రీ కె.టి.రామారావు, తెలంగాణ ప్రభుత్వ పరిశ్రమలు మరియు వాణిజ్యము, ఐ&సి మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రిన్సిపల్ కార్యదర్శి శ్రీ జయేష్ రంజన్ సమక్షంలో Volty Energy యాజమాన్య బృందం ఒప్పందంపై సంతకం చేసింది. తెలంగాణ ప్రభుత్వం యొక్క మద్దతుతో, కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరి నాటికి కర్మాగారం పనిచేసే దశకు తీసుకురావాలని లక్ష్యంగా చేసుకొంది. కర్మాగారం ప్రారంభపు మొదటి దశలో కనీసం 40,000 యూనిట్లను తయారు చేయడానికి Voltly Energy లక్ష్యంగా చేసుకొంది. తదుపరి మూడు సంవత్సరాలలో తయారీ సామర్థ్యం సులభంగా 100,000 వరకూ తీసుకువెళ్ళబడుతుంది.
 
“తెలంగాణ ప్రభుత్వంతో ఈ పెట్టుబడితో, భారతీయ రెగ్యులేటరీ అథారిటీచే ఏర్పరచబడిన Fame2 ఆమోదాలకు అనుగుణంగా భారతీయ విపణి లోనికి నాణ్యమైన విద్యుత్ వాహనాలను తీసుకురావాలని META4 సంకల్పించింది. ఇది ఏకకాలములో ఎలెక్ట్రిక్ మొబిలిటీలో బలమైన ఆర్థిక ముందడుగు దిశగా చోటు కల్పిస్తుంది. దేశములో కర్బన ఉద్గారాలను తగ్గించాలనే విశాల దార్శనికతను బ్రాండు చురుగ్గా పంచుకుంటోంది, అది గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్రమోదీ గారి "పంచామృతం” దార్శనికతతో కలిసిపోతుంది. ఈ సమన్వయము ఆశాదాయకంగా Voltly Energy తమ దార్శనికత అయిన 'భారత్‌లో తయారీ’ క్యాంపెయిన్‌ని ద్విగుణీకృతం చేసుకునే దిశగా బాటలు వేస్తుంది. స్వచ్ఛంగా భారతీయ సంస్థగా తమ గుర్తింపును సుస్థాపితం చేస్తుంది” అన్నారు,  META4 గ్రూప్ సిఇఓ శ్రీ ముజమ్మిల్ రియాజ్.
 
అత్యాధునిక ఉత్పాదనలను ఉత్పత్తి చేయడానికి గాను, కొత్త తయారీ కర్మాగారం అత్యంత ఆధునిక సెమీ-రోబోటిక్స్, సాటిలేని తయారీ కర్మాగార యంత్ర సామాగ్రితో సహా భారీ ఆటోమేషన్ ఇంటిగ్రేషన్ కలిగి ఉంటుంది. ఈ కర్మాగారం రాష్ట్రంలో సుమారు 500 మందికి ప్రత్యక్ష ఉపాధిని, 2000 మందికి పరోక్ష ఉపాధిని కల్పించడానికి సహాయపడుతుంది.
 
MoU సంతకం చేసే సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ మునిసిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి, పరిశ్రమలు మరియు వాణిజ్యం, సమాచార సాంకేతికత శాఖామాత్యులు, కెటి రామారావు ఇలా పేర్కొన్నారు. “ఇ-మొబిలిటీ ధ్యేయాన్ని సాధించడానికి దేశం మొత్తం కష్టించి పనిచేస్తోంది. ఈ విప్లవం మధ్యన, రాష్ట్రం విద్యుత్ వాహన తయారీ రంగం కోసం తెలంగాణను ఎంచుకోవడం పట్ల మాకు సంతోషంగా ఉంది. స్మార్ట్ మొబిలిటీ కొరకు వారి నిబద్ధతలతో దేశంలో విద్యుత్ వాహన విప్లవానికి వారు గొప్ప దోహదకారులు అవుతారని మేము విశ్వసిస్తున్నాం. తమ కర్మాగారమును నెలకొల్పుకోవడానికి అవసరమైన అనుమతులను పొందడానికి గాను Voltly Energyకి అన్ని విధాల తోడ్పాటును అందించడానికి మేము కట్టుబడి ఉన్నాము. TSIIC మార్గదర్శకాల క్రింద ఒక మెగా ప్రాజెక్టుకు వర్తించే వివిధ ప్రోత్సాహకాలను సంస్థకు ఇవ్వడానికి భరోసా ఇస్తున్నాము'' అని అన్నారు.