గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 7 జనవరి 2022 (11:24 IST)

CSIR UGC NET 2021: పరీక్ష రాసే అభ్యర్థులకు కీలక సూచన...

ఉమ్మడి సీఎస్ఐఆర్, యూజీసీ నెట్ 2021 కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్.టి.ఏ) ఓ కీలక సూచన చేసింది. అభ్యర్థులు సమర్పించిన దరఖాస్తుల్లో ఏవేని తప్పులు దొర్లివున్నట్టయితే వాటిని సరిదిద్దుకునే అవకాశాన్ని ఎన్.టి.ఏ కల్పించింది. 
 
ఈ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తుంది. అయితే, అభ్యర్థులు సమర్పించిన దరఖాస్తుల్లో తప్పులు దొర్లితే వాటిని సరిచేసుకునేందు ఎన్.టి.ఏ దిద్దుబాటు విండోను తెరిచింది. దీంతో అభ్యర్థులు తమ ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌లో సవరణలు చేసుకోవచ్చు. దరఖాస్తులో అభ్యర్థులు పూరించిన వివరాలను మరోమారు సరిచూసుకోవచ్చు. 
 
పరీక్ష కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు, వారి దరఖాస్తు, రిజిస్ట్రేషన్ ఫారమ్‌లో మార్పులు చేయాలనుకునే అభ్యర్థులు అధిరాకి వెబ్‌సైట్‌కు వెళ్లి దరఖాస్తులో సవరణలు చేసుకునే అవకాశం ఉంది. ఇందుకోసం జనవరి 9వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 11.50 గంటల వరకు సమయం ఇచ్చింది. ఈ సమయంలో అభ్యర్థులు తాము చేసిన తప్పులను సరిదిద్దుకునే అవకాశం ఉంది. ఎన్.టి.ఏ జారీచేసిన నోటీసు ప్రకరం జనవరి 9వ తేదీ రాత్రి 11.50 గంటల తర్వాత ఎలాంటి మార్పు చేసినా అది పరగణననలోకి తీసుకోరు.