సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 6 జులై 2021 (20:47 IST)

జూలై 20 నుంచి జేఈఈ మెయిన్ 2021

జేఈఈ మెయిన్ విద్యార్థులు పరీక్ష తేదీలపై ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. జేఈఈ మెయిన్స్ మూడో దశ, నాలుగో దశపరీక్షలపై కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ ట్విట్టర్ ద్వారా కీలక ప్రకటన చేశారు. జేఈఈ మెయిన్ 2021 మూడో సెషన్ పరీక్షలు 2021 జూలై 20 నుంచి 25 తేదీ వరకు జరుగుతాయి. ఇక నాలుగో సెషన్ పరీక్షలు 2021 జూలై 27 నుంచి ఆగస్ట్ 2 వరకు జరుగుతాయి. 
 
దరఖాస్తు విండోను మళ్లీ ఓపెన్ చేస్తున్నట్టు మంత్రి ప్రకటించారు. మూడో దశ అంటే ఏప్రిల్ సెషన్ పరీక్షకు జూలై 6 నుంచి జూలై 8 వరకు, నాలుగో దశ అంటే మే సెషన్ పరీక్షకు జూలై 9 నుంచి 12 వరకు దరఖాస్తు చేయొచ్చు. 
 
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ-NTA వెబ్‌సైట్‌లో అప్లై చేయాల్సి ఉంటుంది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఏప్రిల్, మే నెలల్లో జరగాల్సిన జేఈఈ మెయిన్ 2021 సెషన్స్‌ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ-NTA వాయిదా వేసిన సంగతి తెలిసిందే. దీంతో మూడో దశ, నాలుగో దశ పరీక్షలపై అనేక వార్తలు వస్తున్నాయి.