గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 28 సెప్టెంబరు 2023 (18:25 IST)

నెలకు లక్షల రూపాయల వేతనంతో ఎస్.బి.ఐ.లో ఉద్యోగం

sbi bank
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థగా ఉన్న భారతీయ స్టేట్ బ్యాంకులో లక్ష రూపాయల వేతనంతో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఇందుకోసం నోటిఫికేషన్‌ను కూడా జారీచేసింది. దీని ప్రకారం మొత్తం 439 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు బ్యాంకు తెలిపింది. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలను పరిశీలిస్తే, 
 
మొత్తం ఖాళీలు 439 కాగా, అసిస్టెంట్ మేనేజర్ 335, డిప్యూటీ మేనేజర్ 80, చీఫ్ మేనేజర్ 2, మేనేజర్ 8, సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్ 7, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ 1, ప్రాజెక్టు మేనేజర్ 6 చొప్పున భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారి వయసు 2023 ఏప్రిల్ 30వ తేదీ నాటికి 32 నుంచి 45 యేళ్ల మధ్య ఉండాలి. 
 
దరఖాస్తు ఫీజుగా జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 750 రూపాయలు, ఎస్టీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లించనక్కర్లేదు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. వేతనం లక్ష రూపాయల వరకు ఉంటుంది. దరఖాస్తులను అక్టోబరు ఆరో తేదీలోపు చేరవేయాల్సి ఉంటుంది ఆన్‌లైన్ టెస్ట్ 2023 డిసెంబరు లేదా 2024 జనవరి నెలలో నిర్వహిస్తారు.