గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 16 డిశెంబరు 2021 (16:56 IST)

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు రిలీజ్

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ మొదటి సంవత్సర ఫలితాలను గురువారం విడుదల చేశారు. కరోనా రెండో దశ కారణంగా ఈ పరీక్షలను తొలుత వాయిదావేశారు. ఆ తర్వాత పరిస్థితులు అనుకూలించడంతో ఇటీవలే ఈ పరీక్షలను నిర్వహించారు. వీటి ఫలితాలను గురువారం వెల్లడించారు. 
 
ఇంటర్ మొదటి సంవత్సంలో మొత్తం 49 శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. వీరిలో 56 శాతం మంది బాలికలు, 42 శాతం మంది బాలురు ఉత్తీర్ణత సాధించినట్టు ఇంటర్ బోర్డు ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే, ఈ ఫలితాలను https://tsbie.cgg.gov.in అనే వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. 
 
ఈ పరీక్షలకు మొత్తం 4,59,242 మంది విద్యార్థులు హాజరుకాగా, వీరిలో 2,24,012 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో ఏ గ్రేడ్‌లో 1,15,538 మంది పాస్ అయ్యారు. అలాగే, బి గ్రేడ్‌లో 66351 మంది, సి గ్రేడ్‌లో 27752 మంది పాస్ అయినట్టు బోర్డు విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది.