ఆదివారం, 10 నవంబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 28 జులై 2022 (10:41 IST)

తెలంగాణలో 113 ఏఎంవీఐ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

jobs
తెలంగాణ రాష్ట్రంలో 113 అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ (ఏఎంవీఐ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. ఇందుకోసం ఆగస్టు 5వ తేదీ నుంచి సెప్టెంబరు 5వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. 
 
అసిస్టెంట్ మోటర్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ (ఏఎంవీఐ) పోస్టుల భర్తీ కోసం ఆగస్టు 5వ తేదీ నుంచి సెప్టెంబరు 5వ తేదీ వరకు ఒక నెల రోజుల పాటు దరఖాస్తులు స్వీకరిస్తారమని, అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. నోటిఫికేషన్ పూర్తి వివరాలు www.tspsc.gov.inలో ఉంటాయని రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది.
 
కాగా, తెలంగాణాలో మొత్తంగా 80 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు గతంలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో తెరాస ప్రభుత్వం ప్రకటించింది. అందులోభాగంగానే తాజాగా నోటిఫికేషన్ జారీ అయింది. అలాగే, ఇతర శాఖల్లోని ఖాళీలను భర్తీ చేసేందుకు కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వీటిలో గ్రూపు-1తో పాటు పోలీసు శాఖలో కూడా వేర్వేరుగా నోటిఫికేషన్ విడుదల చేసినట్టు పేర్కొంది.