గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. చైనీస్
Written By
Last Updated : సోమవారం, 29 అక్టోబరు 2018 (12:14 IST)

వెజిటెబుల్ వాటర్ సూప్ తయారీ విధానం...

కూరగాయలు ఆరోగ్యానికి చాలా మంచివి. కానీ పిల్లలు వీటిని తినడానికి అంతగా ఇష్టపడరు. కనుక సూప్‌గా తీసుకుంటే పిల్లలు ఇష్టపడి తింటారు. మరి వెజిటెబుల్ సూప్ ఎలా చేయాలో చూద్దాం...
 
కావాలసిన పదార్థాలు:
వాంటన్ షీట్స్ - 4 
క్యారెట్ - 50 గ్రాములు 
బీన్స్ - 50 గ్రాములు 
క్యాబేజి - 50 గ్రా 
ఉల్లిగడ్డలు - 2 
కాలీఫ్లవర్ - 50 గ్రా 
ఉప్పు - తగినంత
మిరియాలపొడి - కొద్దిగా 
అజినా మొటో - తగినంత 
బిర్యానీ ఆకులు - 2 
లెమన్ గ్రాస్ - 2 గ్రా. 
 
తయారీ విధానం:
ముందుగా క్యారెట్, బీన్స్, ఉల్లిగడ్డ, కాలీఫ్లవర్, క్యాబేజి, వేడినీళ్లలో వేసి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఆ తరువాత నీటిని వడగట్టి అందులో ఉప్పు, మిరియాలపొడి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని వాంటన్‌షీట్స్‌లో వేసి కొద్దిసేపు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో బాణలిలో నీళ్లు పోసి క్యారెట్, బీన్స్, ఉల్లిపాయ, లెమన్ గ్రాస్‌ వేసుకుని 2 గంటలపాటు ఉడికించి చివరలో బిర్యానీ ఆకులు వేసి కాసేపు ఉంచాలి. ఇప్పుడు అందులో ఉన్న కూరగాయలన్నీ తీసివేయాలి. ఈ నీరు చిక్కపడే వరకు అలాగే ఉండనివ్వాలి. ఇప్పుడు అందులో ముందుగా తయారుచేసుకున్న వాంటన్‌షీట్స్‌ని, క్యారెట్‌ముక్కలను, ఉప్పు, మిరియాలపొడి, అజినామొటో వేసి 2 నిమిషాలు ఉడకనివ్వాలి. వేడి వేడి వెజిటెబుల్ వాటర్ సూప్ రెడీ.