పప్పు మాడినప్పుడు.. ఇలా చేస్తే..?
చాలామంది వంటలు బాగా చేస్తారు. కానీ, ఆ వంటిట్లోని పదార్థాలు ఎలా భద్రపరచాలో తెలియక సతమవుతుంటారు. అందుకు ఈ చిట్కాలు పాటిస్తే.. మంచి ఫలితాలు పొందవచ్చును. మరి అవేంటో.. తెలుసుకుందాం...
1. పప్పు మాడినట్లుగా వాసన వస్తే దానిని వేరేగిన్నెలోకి మార్చి రెండు తమపాలకులు వేసి ఆపా సన్నని సెగతో ఉడకిస్తే మాడువాసన పోతుంది.
2. అల్లం, మిరియాలు, యాలకులు మెత్తని పొడిలా చేసి టీలో కలిపితే రుచి రావడమే కాకుండా.. అజీర్తి సంబంధమైన వ్యాధులు దరిచేరవు.
3. లడ్డూలు గట్టిపడినట్లయితే వాటిని బాగా పొడిచేసి, లడ్డూకి ఒక చెెంచా చొప్పున పాలు వేసి కలపండి. తాజా లడ్లూడా తయారవుతాయి.
4. బీట్‌రూట్‌ను సన్నగా తురిమి ఎండబెట్టి మెత్తని పొడిలా చేసుకుని ఫుడ్ కలర్‌గా ఉపయోగించుకోవచ్చును.
5. హాట్ వాటర్ బాటిల్‌లో ఎక్కువ సేపు వేడిగా ఉండాలంటే చిటికెడు ఉప్పు ఆ నీటిలో కలిపితే చాలు.
6. కుక్కర్ గాస్కెట్ ఉపయోగించిన వెంటనే ఐస్ వాటర్‌లో ముంచితే ఎక్కువ రోజులు నిల్వవుంటుంది.
7. ఆలుగడ్డలు త్వరగా ఉడకాలంటే.. వాటిని అరగంట పాటు నీళ్ళల్లో నానబెట్టి.. ఆ తరువాత ఉడికించుకుంటే.. త్వరగా ఉడుకుతాయి.
8. బియ్యం పురుగు పట్టకుండా ఉండాలంటే.. డబ్బాలో బియ్యంతో పాటు వేపాకు వేసి నిల్వ ఉంచుకోవాలి.
9. సీసాలోని పచ్చళ్ళు చెడిపోకుండా ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే.. సీసా మూత చుట్టూ ఉప్పు రాయండి.
10. పప్పులు నిల్వ చేసేటప్పుడు పురుగు పట్టకుండా ఉండాలంటే.. డబ్బాలలో అడుగున ఉప్పుకల్లు చల్లాలి.