సోమవారం, 14 అక్టోబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. చిట్కాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 4 ఆగస్టు 2022 (23:17 IST)

కరివేపాకు ఆకులు సీసాలో వేసి గట్టిగా మూతపెడితే?

కరివేపాకు ఆకులు సీసాలో వేసి గట్టిగా మూతపెట్టి ఫ్రిజ్‌లో ఉంచితే చెడిపోకుండా ఉంటాయి. బియ్యం పురుగులు పట్టకుండా వుండాలంటే.. కరివేపాకు ఆకులు వేసి వుంచాలి. అన్నం ఉడికేటప్పుడు బియ్యంలో కొద్దిగా నిమ్మరసం పిండితే అన్నం పువ్వులా వుడుకుతుంది. 
 
నెయ్యి త్వరగా పేరుకుపోకుండా వుండాలంటే... మీగడ కట్టేటప్పుడు కొద్దిగా నీళ్లు చల్లాలి. యాలకుల తొడిమెలు పొడి చేసి చక్కెరలో  కలిపి టీలో వేస్తే టీ రుచిగాను, సువాసన గానూ వుంటుంది. గోధమ రవ్వ మైదా పిండి ప్లాస్టిక్ కవర్ లో వేసి ఫ్రిజ్‌లో వుంచితే చాలా రోజులు చెడిపోకుండా వుంటుంది.