ఆదివారం, 24 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. చిట్కాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 4 మార్చి 2024 (17:51 IST)

వంటింటి చిట్కాలు.. రసం కోసం చింతపండు.. బెల్లం కలిపితే?

Chick peas Rasam
పుదీనా, టమోటాలను బాగా మిక్సీ పట్టి బజ్జీలు చేసే పిండిలో కలిపితే బజ్జీలు కలర్ ఫుల్‌గానే కాకుండా హెల్దీగానూ వుంటాయి. రసం కోసం చింతపండును కలిపేటప్పుడు కాసింత బెల్లం కలిపితే రసం టేస్టీగా వుంటుంది. బయట షాపుల నుంచి కొని తెచ్చే కూరగాయలను కాసేపు నిమ్మరసం కలిపిన నీటిలో నానబెడితే.. వాటిపై వున్న క్రిములు నశించిపోతాయి. 
 
ఉల్లిపాయలు, వెల్లుల్లి, బంగాళాదుంప, తేనె, అరటిపండ్లు, గుమ్మడి కాయలను ఫ్రిజ్‌లో వుంచకూడదు. కొబ్బరి చట్నీలో నీటిని చేర్చడానికి బదులు కాసింత కొబ్బరి పాలును కలిపితే టేస్టు అదిరిపోతుంది. మామిడి కాయ, నిమ్మకాయ ఊరగాయలో కాసింత ఆవ నూనె చేర్చితే.. చాలాకాలం పాటు చెడిపోకుండా వుంటుంది. 
 
క్యారెట్, బీట్‌రూట్ తురుమును దోసె పిండితో కలిపి దోసె పోస్తే టేస్ట్ అదిరిపోతుంది. వంకాయ కర్రీ చేసేటప్పుడు సపరేటుగా వంకాయలను నేతిలో వేయించి కూరలో చేర్చితే టేస్టు బాగుంటుంది. ఆకుకూరలు వండేటప్పుడు పసుపు నీటితో కలిపిన వేడినీటిలో ఉడికిస్తే.. ఆకుకూర టేస్టుగా వుంటుంది.