ఆదివారం, 12 జనవరి 2025
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. చిట్కాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 9 జనవరి 2024 (20:36 IST)

వంటింటి చిట్కాలు.. ఆకుకూరలు వండేటప్పుడు పంచదారను..?

cookery Tips
వడ, పకోడా వంటివి క్రిస్పీగా వుండాలంటే.. పిండిలో ఒక టేబుల్ స్పూన్ రవ్వను చేర్చుకోండి. సాంబారుకు పప్పు ఉడికించేటప్పుడు ఆ పప్పులో అరస్పూన్ మెంతులు కలిపితే సాంబారు రుచిగా వుంటుంది. ఆకుకూరలు వండేటప్పుడు అర స్పూన్ పంచదార కలిపితే రుచితో పాటు ఆకుకూర రంగు మారదు. 
 
నవధాన్యాలను నానబెట్టి.. మొలకెత్తిన తర్వాత నానబెట్టిన మినపప్పును కలిపి ఉప్పు, వెల్లుల్లి పాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు, ఇంగువ కలిపి ఉండలుగా చేసి ఎండలో నానబెట్టి వడియాల్లా సిద్ధం చేసుకోవచ్చు. 
 
తరిగిన టమోటా, పుచ్చకాయ, దోసకాయ ముక్కల్ని ఒక కప్పులోకి తీసుకుని, ఒక టీ స్పూన్ ఆలివ్ ఆయిల్, మిరియాల పొడి అర స్పూన్, రుచికి తగినంత ఉప్పు చేర్చి.. బాగా కలిపి పుదీనా తురుముతో తీసుకుంటే పోషకాహారంతో కూడిన అల్పాహారం రెడీ అయినట్లే.