ఆపిల్ తొక్కతో అల్యూమినియం వస్తువుల్ని తోమితే?
వంట గదిలో వాడే వస్తువులను వాడుకోవచ్చు. ఎలాగంటే.. ఈ టిప్స్ పాటించండి. ఆపిల్ తొక్కతో అల్యూమినియం వస్తువులను తోమితే... మురికిపోయి మెరుస్తాయి. నారింజ, బత్తాయి వంటి పండ్ల తొక్కని బ్రౌన్ షుగర్ ఉన్న డబ్బాల
వంట గదిలో వాడే పదార్థాలను వేస్ట్ చేయకుండా వాడుకోవచ్చు. ఎలాగంటే.. ఈ టిప్స్ పాటించండి.
ఆపిల్ తొక్కతో అల్యూమినియం వస్తువులను తోమితే... మురికిపోయి మెరుస్తాయి. నారింజ, బత్తాయి వంటి పండ్ల తొక్కని బ్రౌన్ షుగర్ ఉన్న డబ్బాలో పెట్టండి. అలా చేస్తే బ్రౌన్ షుగర్ గట్టిపడదు. గుడ్డు పెంకులను సింక్ దగ్గర, వంటగదిలో అక్కడడక్కడ ఉంచితే బల్లులు దరి చేరవు.
టీ బ్యాగులు వాడేశాక వాటిని డస్ట్ బిన్ లో వేయకుండా దాయండి. టీ పొడిలో ఉన్న టానిక్ యాసిడ్‌లో యాంటీ ఇన్‌ఫ్లమ్మేటరీ లక్షణాలు ఎక్కువ. కీటకాల కరిచిన చోట ఈ బ్యాగులను కాస్త తడిపి పెడితే త్వరగా తగ్గుతాయి. సైడ్ ఎఫెక్ట్‌లు ఏమీ ఉండవు.
ఇకపోతే.. సాండ్ విచ్‌లు చేస్తున్నారా? బ్రెడ్ చుట్టూ మందంగా ఉండే అంచును తీసి పడేయకండి. దానిని ఒక డబ్బాలో దాచి పెట్టండి. అలాంటివి ఎక్కువగా దాచాక... తీసి మిక్సీలో వేసి పొడి చేసి పెట్టుకోండి. ఆ బ్రెడ్ పొడి వంటల్లో వాడుకోవచ్చు.