శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : గురువారం, 9 జులై 2020 (18:46 IST)

కరోనా బారిన బెంగళూరు పోలీసులు.. ఎవరికి కోవిడ్ సోకిందో ఎలా తెలుస్తుంది?

కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా విజృంభిస్తోంది. బెంగళూరు పోలీసులు కరోనా వైరస్ బారిన పడుతున్నారు. ఇప్పటివరకు 395 మంది పోలీసులు కరోనా వైరస్ బారిన పడినట్లు ఐజీ హేమంత్ నిబాల్కర్ చెప్పారు. వీరిలో 190మంది కోలుకోగా, 200 మంది చికిత్స పొందుతున్నారు. 
 
కరోనా వైరస్ ప్రభావంతో 20 పోలీస్ స్టేషన్లకు సీలు వేసినట్లు హేమంత్ తెలిపారు. కరోనా వైరస్ విధులు నిర్వర్తించడంతో ఇతర విభాగాలతో పోలిస్తే.. బెంగళూరు పోలీసులు ముందున్నారని తెలిపారు. 
 
వైరస్ నుంచి తమను తాము ఎలా రక్షించుకోవాలో శిక్షణ ఇచ్చినప్పటికీ పెద్ద ఎత్తున ఈ మహమ్మారి బారినపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము వందలాది మందిని కలుస్తుంటామని, వారిలో ఎవరికి కోవిడ్ సోకిందో తెలియదని నింబాల్కర్ పేర్కొన్నారు. పోలీసులతో పాటు వారి కుటుంబాలకు కూడా వైరస్ ముప్పు పొంచి ఉందని ఐజీ తెలిపారు. 
 
బెంగళూరులోని వీవీపురం పోలీస్ స్టేషన్‌ ఏఎస్సై జూన్ 13న కరోనా వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. ఈయనే బెంగళూరులో కరోనాతో ప్రాణాలు కోల్పోయిన తొలి పోలీసని నింబాల్కర్ చెప్పారు.