శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 31 జనవరి 2022 (09:24 IST)

తగ్గిన కోవిడ్ పాజిటివిటీ రేటు.. పెరిగిన కరోనా మరణాలు

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా తగ్గుతూ వస్తుంది. రోజువారీ కోవిడ్ పాజిటివిటీ రేటు కూడా క్రమంగా తగ్గిపోతుంది. అయితే, కరోనా వైరస్ మరణాలు మాత్రం పెరుగుతున్నాయి. ఇది ఇటు ప్రజలతో పాటు అటు అధికారులను ఆందోళనకు గురిచేస్తుంది. 
 
తాజా నివేదిక ప్రకారం గడిచిన 24 గంటల్లో 2,34,281 మందికి కోవిడ్ వైరస్ సోకింది. అయితే, 893 మంది బాధితులు ఈ వైరస్ సోకడం వల్ల ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఖ్యలో కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోవడానికి ప్రధాన కారణంగా డెల్టా వైరస్ కారణమై ఉండొచ్చని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
 
గతంలో రోజు వారీ కేసులు 3 లక్షలకు పైగా నమోదైనప్పటికీ మరణాల సంఖ్య 400 లోపు ఉండేవిచ కానీ, ఇపుడు దేశ వ్యాప్తంగా కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ.. మరణాల సంఖ్య మాత్రం ఆందోళన కలిగించడం ఇపుడు ప్రభుత్వ వర్గాలను ఆందోళనకు గురిచేస్తుంది.