శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : బుధవారం, 11 నవంబరు 2020 (14:29 IST)

ఏపీలో పెరుగుతున్న కరోనా.. 24 గంటల్లో 1,836 కేసులు

ఏపీలో మళ్లీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. 24 గంటల్లో ఏపీలో 1,836 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మంగళవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో గడిచిన 24 గంటల్లో 67,910 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 1,836 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 8,46,245కి చేరింది. కరోనా వైరస్‌ మరణాల్లో స్వల్పంగా పెరుగుదల నమోదైంది.
 
గడిచిన 24 గంటల్లో కరోనా వైరస్‌ బారిన పడి 12 మంది మృతి చెందారు. చిత్తూరు జిల్లాలో ముగ్గురు, కృష్ణా లో ముగ్గురు, అనంతపురంలో ఒకరు, తూర్పు గోదావరిలో ఒకరు, గుంటూరులో ఒకరు, ప్రకాశం లో ఒకరు, విశాఖపట్నంలో ఒకరు, పశ్చిమ గోదావరిలో ఒకరు మరణించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 6,814 కి చేరింది.
 
రాష్ట్రంలో డిశ్చార్జి లు భారీగా పడిపోయాయి. మంగళవారం 2,151 మంది కోవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో 8,18,473 మంది కరోనా మహమ్మారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి కాగా, ప్రస్తుతం 20,958 యాక్టివ్‌ కేసులున్నాయి.