శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 13 సెప్టెంబరు 2020 (14:39 IST)

తెలంగాణలో కొత్తగా 2,216 కరోనా కేసులు.. 11మంది మృతి

తెలంగాణలో కరోనా వ్యాప్తి తగ్గడం లేదు. కేసులు భారీగానే నమోదవుతున్నాయి. తెలంగాణలో కొత్తగా 2,216 కరోనా కేసులు నమోదు కాగా..11 మంది మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో 2,603 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 1,57,096కి చేరగా.. చికిత్స నుంచి కోలుకుని 1,24,258 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. 
 
ఇప్పటివరకు 961 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 31,607 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కొత్తగా జీహెచ్ఎంసీ పరిధిలో 341, రంగారెడ్డిలో 210, మేడ్చల్ 148 కేసులు నమోదయ్యాయి. శనివారం ఒక్కరోజే 11 మంది కరోనాతో పోరాడుతూ మరణించారు. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 961కి చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. శనివారం ఒక్కరోజే 2,603 మంది కరోనా నుంచి కోలుకున్నారు.