తెలంగాణ అసెంబ్లీలో అక్బరుద్దీన్‌కు కోపమొచ్చింది, ఎందుకంటే?
తెలంగాణా అసెంబ్లీ కాస్త అట్టుడిగింది. టిఆర్ఎస్ ఎమ్మెల్యేలో అసెంబ్లీలో ఎక్కువగా ఉన్నా ఒకే ఒక్క ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ కారణంగా అసెంబ్లీ కాస్త రచ్చరచ్చగా మారింది. చివరకు సిఎం చంద్రశేఖర్ రావు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది.
నూతన రెవిన్యూ విధానాన్ని తెలంగాణా అసెంబ్లీలో ప్రవేశపెట్టారు కెసిఆర్. సుమారుగా గంటన్నరపాటు సుధీర్ఘంగా ప్రసంగించారాయన. ఆ తరువాత అక్బరుద్దీన్ ఒవైసీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. గత ఆరు నెలల నుంచి కరోనాతో ఇబ్బంది పడుతున్నాం.
ప్రాణాలకు తెగించి వర్కర్లు, డాక్టర్లు, పోలీసులు పనిచేస్తున్నారు. వారి ప్రస్తావన కనీసం తీసుకొచ్చారా సిఎం మీరు అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. అంతేకాదు ఆర్థిక శాఖామంత్రి ఈటెల రాజేందర్ పైనా ఆరోపణలు చేశారు అక్బరుద్దీన్ ఒవైసీ. అసలు వీళ్ళా మంత్రులంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. పది నిమిషాల పాటు అసెంబ్లీ కాస్త రచ్చరచ్చగా మారింది.