శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 19 జూన్ 2021 (13:09 IST)

మాస్కులు ధరించడం వల్ల రోగనిరోధకశక్తి బలహీనపడుతుందా?

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ బారినపడకుండా ఉండేందుకు వీలుగా విధిగా మాస్కులు ధరించాలని, భౌతికదూరం పాటించాలని వైద్య నిపుణులు పదేపదే హెచ్చరిస్తున్నారు. దీంతో అనేక మంది ఇంట్లో నుంచి కాలుబయటపెడితే ముఖానికి మాస్క్ ధరిస్తున్నారు. అయితే, ఈ మాస్కులు ధరించడం వల్ల శరీరంలో రోగనిరోధకశక్తి తగ్గుతుందని ఇంగ్లండ్‌లోని రాయల్ కాలేజ్ ఆఫ్ జనరల్ ప్రాక్టీషనర్స్ (ఆర్ఎస్‌జీపీ) నిర్వహించిన తాజా అధ్యయనం వెల్లడిస్తోంది. 
 
ముఖ్యంగా చిన్నారుల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉన్నట్టు ఈ అధ్యయనం తేల్చింది. ఈ మార్గదర్శకాలను పాటించడం వల్ల కోవిడ్ మాత్రమే కాకుండా ఫ్లూ వంటి ఇతర శ్వాస సంబంధిత సమస్యల నుంచి కూడా తప్పించుకోవడం సాధ్యమైందని తెలిపింది. 
 
ఈ అధ్యయనంలో వెల్లడైన అంశాలు ఏమిటంటే, మాస్క్ ధారణ, భౌతిక దూరం పాటించడానికి సంబంధించిన ఆంక్షలను ఉపసంహరించిన తర్వాత సాధారణ సూక్ష్మ జీవుల నుంచి తప్పించుకునే సామర్థ్యం బాలలకు తగ్గుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. 
 
దీనికి కారణం కోవిడ్-19 మార్గదర్శకాల అమలుకాలంలో బాలల్లో రోగ నిరోధక శక్తి బలహీనపడటమేనని చెప్తున్నారు. ఈ ఆంక్షల అమలు కాలంలో బాలలు మాస్క్‌లు ధరిస్తూ, భౌతిక దూరం పాటిస్తూ సూక్ష్మ జీవుల నిరోధక సామర్థ్యాన్ని పెంచుకోలేకపోయినట్టు తేలిందని పేర్కొంది.