మంగళవారం, 23 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 11 జనవరి 2022 (17:10 IST)

గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో కరోనా కల్లోలం... అనేక మందికి పాజిటివ్

హైదరాబాద్ నగరంలోని గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో కరోనా కల్లోలం సృష్టిస్తుంది. ఈ రెండు ఆస్పత్రులకు చెందిన సిబ్బందిలో అనేక మంది ఈ వైరస్ బారినపడ్డారు. అలాగే, పలువురు వైద్య, నర్సింగ్ విద్యార్థులు కూడా ఉన్నారు. 
 
గాంధీ ఆస్పత్రి అనుబంధ వైద్య కాలేజీలో 20 మందికి ఎంబీబీఎస్ విద్యార్థులకు పాజిటివ్ అని తేలింది. అలాగే 10 మంది హౌస్ సర్జన్లు, 10 మంది పీజీ విద్యార్థులు, నలుగురు ఫ్యాకల్టీ సిబ్బందికి కోవిడ్ పాజిటివ్ అని తేలింది. గాంధీ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందితో పాటు ప్రాక్టీస్ చేస్తున్న విద్యార్థుల్లో 44 మంది కోవిడ్ బారినపడ్డారు. 
 
ఇక ఉస్మానియా ఆస్పత్రిలోనూ కరోనా కలకలం చెలరేగింది. ఉస్మానియాలోని 19 మంది ఎంబీబీఎస్ విద్యార్థులకు, 35 మంది హౌస్ సర్జన్లకు, 23 మంది జూనియర్ వైద్యులకు, ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లకు ఈ వైరస్ సోకింది. ఉస్మానియా వైద్య వర్గాల సమాచారం మేరకు ఈ ఆస్పత్రిలో మొత్తం 79 మందికి ఈ వైరస్ సోకింది. దీంతో గాంధీ, ఉస్మానియా వైద్య వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.