శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 18 మే 2020 (08:21 IST)

క్వారంటైన్‌గా మారిన దెయ్యాల గ్రామం... ఎక్కడ?

కరోనా వైరస్ బారినపడిన వారి కోసం ప్రభుత్వం అందుబాటులో ఉన్న భవనాల్లో క్వారంటైన్ సౌకర్యాలు కల్పిస్తోంది. అలా.. ఇపుడు దెయ్యాల గ్రామం కూడా క్వారంటైన్‌గా మారిపోయింది. ఈ గ్రామం ఎక్కడుందో తెలుసా? ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్‌లో. 
 
దేశంలోని పలుప్రాంతాల్లో చిక్కుకునిపోయిన వలస కూలీలు తమతమ సొంతూళ్ళకు వెళ్లేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. దీంతో అనేకమంది వలస కూలీలు, కార్మికులు తమతమ రాష్ట్రాలకు చేరుకుంటున్నారు. అలాంటివారిలో ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందినవారు కూడా ఉన్నారు. 
 
కరోనా కేసులు అతి తక్కువగా ఉన్నా రాష్ట్రాల్లో ఉత్తరాఖండ్ ఒకటి. అయితే, వలస కూలీలు రాక తర్వాత ఈ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఫలితంగా ప్రస్తుతం 89 కేసులు ఉన్నాయి. ఆదివారం కూడా ఆరు కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రానికి వచ్చే వలస కూలీల కోసం ఓ క్వారంటైన్ ఏర్పాటు చేసింది. 
 
ముఖ్యంగా, ఆ రాష్ట్రంలోని పూరి జిల్లాల్లో ఉపాధి లేక ఓ గ్రామంలోని ప్రజలంతా ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఆ గ్రామానికి దెయ్యాల గ్రామంగా పేరువచ్చింది. ఇపుడు ఈ దెయ్యాల గ్రామాన్ని వలస కార్మికుల కోసం క్వారంటైన్ ఏర్పాటు చేశారు.