దేశంలో కరోనా పాజిటివ్ కేసులెన్ని : గణనీయంగా తగ్గుదల

మంగళవారం, 25 మే 2021 (10:23 IST)
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గాయి. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1,96,427 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదేసమయంలో మహమ్మారి నుంచి కోలుకుని 3,26,850 మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశవ్యాప్తంగా 3,511 మంది కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు. ఈ వివరాలను కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
 
గత కొన్ని రోజులుగా కరోనా సెకండ్ వేవ్ అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఒకానొక సమయంలో ఒకే రోజు దాదాపు 4.5 లక్షల పాజిటివ్ కేసులు కూడా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు లాక్డౌన్ విధించడమో, లేక కఠినమైన కర్ఫ్యూని అమలు చేయడమో చేస్తున్నాయి. దీంతో, కరోనా వ్యాప్తి కట్టడిలోకి వచ్చింది. తాజాగా కొత్త కరోనా కేసులు 2 లక్షల దిగువకు వచ్చాయి.
 
మరోవైపు ఇప్పటివరకు దేశంలో 2,69,48,874 మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో 2,40,54,861 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు చనిపోయినవారి సంఖ్య 3,07,231కి చేరింది. ప్రస్తుతం దేశంలో 25,86,782 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరోవైపు ఇప్పటివరకు 19,85,38,999 మందికి వ్యాక్సిన్ వేయడం జరిగింది. 

అన్నీ చూడండి

Nivetha Pethuraj: వెంకీ, చిరు సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన నివేదా పేతురాజ్

Madhura Sridhar: అలా చేయడంతో ఇండస్ట్రీ పరువు పోతుంది : మధుర శ్రీధర్ రెడ్డి

సందిగ్ధం విజయం సాధించాలని కోరుకుంటున్నా : తమ్మారెడ్డి భరద్వాజ్

Srikanth: మిడిల్ క్లాస్ కుటుంబాలందరికీ కనెక్ట్ అయ్యే మిస్టర్ మిడిల్ క్లాస్ :శ్రీకాంత్

Dil Raju: కథా బలమున్న చిల్డ్రన్ ఫిలిం సమ్మర్ హాలిడేస్ ఎంటర్ టైన్ చేయాలి : దిల్ రాజు

తర్వాతి కథనం
Show comments