సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శనివారం, 11 మార్చి 2023 (19:10 IST)

H3N2: భారత్‌లో ఇద్దరు మృతి.. 90మందికి పాజిటివ్

Mask
భారత్‌లో ఇన్‌ఫ్లూయంజా వైరస్ కలకలం రేపుతోంది. ఈ H3N2తో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. హర్యానాకు చెందిన ఓ వ్యక్తి, కర్ణాటకకు చెందిన ఒకరు H3N2తో మృతి చెందారు. దేశంలో 90 మందికి ఇన్‌ఫ్లూయంజా H3N2 సోకింది. గత కొన్ని నెలలుగా H3N2 బారిన పడేవారు అధికమవుతున్నారు. అనేక వ్యాధులు H3N2తో ఏర్పడుతున్నాయి. దీనిని హాంకాంగ్ ఫీవర్ అని పిలుస్తున్నారు. దేశంలో ఇతర ఇన్‌ఫ్లూయంజాలతో బాధపడేవారికంటే H3N2 బారిన పడే వారి సంఖ్య అధికమవుతోంది. భారత్‌లో ఇప్పటివరకు H3N2, H1N1 వైరస్‌లను మాత్రమే కనుగొన్నారు. 
 
H3N2 వైరస్ లక్షణాలు
జలుబు, దగ్గు, జ్వరం, 
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది,
వాంతులు 
చర్మ వ్యాధులు
శరీరంలో నొప్పులు 
విరేచనాలు.. ఈ లక్షణాలు వారం పాటు వుంటే తప్పకుండా చికిత్స తీసుకోవాల్సిందేనని.. వైద్యులు హెచ్చరిస్తున్నారు.