మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : గురువారం, 24 సెప్టెంబరు 2020 (09:53 IST)

కరోనా వ్యాక్సిన్... జాన్సన్ అండ్ జాన్సన్ ట్రయల్.. ఒక్క డోసే..

కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ కోవిడ్‌ నియంత్రణకు వ్యాక్సిన్ ట్రయల్స్ తుది దశకు చేరుకుంటున్నాయి. ఇప్పటికే పలు ప్రముఖ కంపెనీలు తమ వ్యాక్సిన్ పరీక్షల వేగం పెంచాయి. ఓ దశలో రష్యా వ్యాక్సిన్ కూడా విడుదల చేసింది. 
 
మరో వ్యాక్సిన్‌ను రిజిస్టర్ చేసుకునేందుకు సిద్ధమైంది. ఇక ఈ బాటలోనే జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ కూడా ప్రయోగాలు చేస్తోంది. అయితే మిగితా వాటికి భిన్నంగా ఈ వ్యాక్సిన్ ఉండటం విశేషం. 
 
సాధారణంగా కరోనా వైరస్ అంతం చేయడానికి కనీసం రెండు డోసులు అయినా తీసుకోవాలని ఇప్పటి వరకు పలు కంపెనీలు ప్రకటించాయి. కానీ తమ సంస్థ తయారుచేసే మందు ఒకే ఒక్క డోసు ఇస్తే కరోనా అంతం అవుతుందని చెప్తోంది. 
 
దీనికి సంబంధించిన ట్రయల్స్ తుది దశకు చేరుకున్నాయని ప్రకటించింది. అమెరికా, అర్జెంటీనా, బ్రెజిల్, చిలీ, కొలంబియా, మెక్సికో, పెరూలో మొత్తం 60 వేల మంది వాలంటీర్లకు ఈ టీకా ఇచ్చేందుకు సిద్ధం అయ్యారు. మంచి ఫలితాలు రాగానే మార్కెట్లోకి విడుదల చేస్తామని ప్రకటించారు.