బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : బుధవారం, 30 జూన్ 2021 (09:53 IST)

కోళ్లకు కొత్త వైరస్... కీసరలో చనిపోతున్నాయి.. రేట్లు పెరిగాయ్

వైరస్‌ల బాధ రోజురోజుకీ పెరిగిపోతుంది. మనుషులకే కాకుండా కోళ్ళకు కూడా కొత్త వైరస్ సోకింది. కీసరలో కోళ్లకు కొత్త వైరస్ సోకింది. దీంతో పౌల్ట్రీల్లో కోళ్లు చచ్చిపోతున్నాయి. కోళ్లు చనిపోవడంతో వ్యాపారులు చికెన్ ధరలను పెంచారు. 
 
మే నెలలో కిలో చికెన్ ధర రూ. 130 నుంచి 150 రూపాయలు ఉంది. గత 15 రోజులుగా చికెన్ కేజీ రూ.200లకు పైగా అమ్ముతున్నారు. గత కొన్ని రోజులుగా కోళ్లు అంతుచిక్కని రోగాలతో చనిపోతున్నట్లు ఫౌల్ట్రీ వ్యాపారులు చెబుతున్నారు.
 
దీంతో తమకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని వాపోతున్నారు. కనీస ఖర్చులు కూడా రావడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పెట్రోల్ రేట్ పెరగడంతో కోళ్ల ట్రాన్స్ పోర్టు ఖర్చులు పెరిగాయని, అటు కొత్త వైరస్ టెన్షన్ పెడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
 
ఈ రేట్లు మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. కోళ్లలో ఇన్ఫెక్షన్ వ్యాపిస్తోందని, అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అయితే కోళ్లు, పశువుల్లో వైరస్‌లు సహజమని పశువైద్యులు కొట్టి పారేస్తున్నారు.