suvichar

రెండవసారి కరోనా వైరస్ పాజిటివ్ వస్తే?

Updated: శుక్రవారం, 22 మే 2020 (14:11 IST)
ప్రపంచ వ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో దాని నుండి బయటపడేందుకు పరిశోధనలు ముమ్మరంగానే జరుగుతున్నాయి. ఇప్పటికే లక్షల మంది దాని బారిన పడి ప్రాణాలు కోల్పోగా, దాని నుండి సురక్షితంగా బయటపడిన వారూ ఉన్నారు. అయితే కరోనా నుండి కోలుకున్న వారికి రెండో సారి మళ్లీ పాజిటివ్ వస్తే ఏమవుతుందనే సందేహం రానే వస్తోంది. అలాంటి దాఖలాలు కూడా ఉన్నాయి.
 
దక్షిణ కొరియాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, ప్రివెన్షన్ చేసిన పరిశోధనలలో తేలిందేమంటే రెండోసారి కరోనా వస్తే భయపడాల్సిన పనిలేదు, వారి ద్వారా కరోనా వ్యాపించడం కూడా చాలా తక్కువ. వారు కోవిడ్ నుండి కోలుకున్న దాదాపు 400 మందిపై పరిశోధనలు చేయగా వారిలో 285 మంది మళ్లీ కోవిడ్ బారిన పడి ఉన్నారు. 
 
అయితే వీరితో సన్నిహితంగా ఉన్న వారి పరిస్థితి గమనిస్తే, ఏ ఒక్కరికి కూడా కోవిడ్ ఉన్నట్లు తేలలేదు. కోలుకున్న వారిలో వైరస్‌ని ఎదుర్కొనే యాంటీబాడీలు సమృద్ధిగా ఉంటాయని, వారు భయపడాల్సిన పనిలేదని వారు చెప్పారు. రెండోసారి కరోనా వచ్చిన వారిని వైరస్ వ్యాప్తి కారకాలుగా పరిగణించడం లేదని దక్షిణ కొరియా అధికారులు వెల్లడించారు.

అన్నీ చూడండి

Adivi Sesh: అడివి శేష్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘G2’ 2027న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్

Nani: న్యాచురల్ స్టార్, కయాదు లోహార్ బ్రాండ్ న్యూ పోస్టర్

Allu and Rashmika: రాకా కోసం క్రేజీ కాంబినేషన్ పుష్ప జోడీ మళ్లీ రంగంలోకి దిగింది !

Manchu Mano: ఆస్మాన్ తో మేఘాంశ్ గొప్ప హిట్ కొట్టాలని కోరుకుంటున్నా : మంచు మనోజ్

SS Rajamouli: వారణాసిలో రామాయణ ఎపిసోడ్ కోసం భారీ సెట్టింగ్ ?

తర్వాతి కథనం
Show comments