శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 20 జులై 2020 (08:56 IST)

శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకుడు కరోనాతో కన్నుమూత

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుమల శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకుడు శ్రీనివాసమూర్తి దీక్షితులు కరోనా వైరస్‌తో ప్రాణాలు కోల్పోయాడు. గత కొన్ని రోజుల క్రితం ఆయనకు వైరస్ సోకింది. దీంతో ఆయన్ను తిరుపతిలోని ఓ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఆయన చికిత్స పొందుతూ కన్నుమూశారు. 
 
కాగా, శ్రీవారి సేవలో రెండు దశాబ్దాలకు పైగా కొనసాగిన దీక్షితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం క్రితం తుదిశ్వాస విడిచారు. దీక్షితులకు ఆలయం తరపున సంప్రదాయ పద్ధతిలో అంతిమ వీడ్కోలు నిర్వహించాల్సి ఉంది. 
 
అయితే, ఆయన కరోనాతో మృతి చెందడంతో ఇది సాధ్యమయ్యే పని కాదని తెలుస్తోంది. అంతేకాదు, ఆయన భౌతిక కాయాన్ని కుటుంబ సభ్యులకు కానీ, మరొకరికి కానీ అప్పగించే అవకాశం కూడా లేదని సమాచారం.