బుధవారం, 25 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 4 డిశెంబరు 2019 (17:11 IST)

కైలాస దేశాన్ని ఏర్పాటు చేశానన్న నిత్యానంద.. వీసా ఎలా తీసుకోవాలి స్వామి..

వివాదాస్పద స్వామి నిత్యానంద స్వామికి భారత క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ తేరుకోలేని కౌంటరిచ్చారు. కైలాశ దేశానికి వీసా ఎలా తీసుకోవాలంటూ ప్రశ్నించారు. ఇంతకీ నిత్యానందను టార్గెట్ చేస్తూ అశ్విన్ ఎందుకు కౌంటర్ వేశారో పరిశీలిద్ధాం. 
 
ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న నిత్యానంద స్వామి... తాను కైలాస దేశాన్ని ఏర్పాటు చేశానంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఇపుడు వివాదాస్పదంగా మారాయి. ఈ వార్తను విన్న ప్రతి ఒక్కరూ ఆశ్చర్యానికి లోనవుతున్నారు. 
 
పైగా, కరీబియన్ దీవుల సమీపంలో ఓ చిన్న దీవిని కొనుగోలు చేసిన నిత్యానంద... ప్రపంచంలోనే ఏకైక హిందూ దేశంగా తన దీవిని పేర్కొన్నారు. ఆ దేశానికి ఒక జెండా, రాజ్యాంగం, అధికారం చిహ్నాన్ని కూడా విడుదల చేశారు. తన దేశంలో ప్రధానితో పాటు చిన్నసైజు కేబినెట్ కూడా ఉందని చెప్పారు. విరాళాలను ఇవ్వడం ద్వారా తన దేశ పౌరసత్వాన్ని పొందవచ్చని తెలిపారు.
 
ఈ వ్యాఖ్యలపై క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ సెటైరికల్ ట్వీట్ చేశారు. 'కైలాస దేశానికి వీసా పొందడానికి ప్రొసీజర్ ఏమిటి? వీసా ఆన్ అరైవల్ సదుపాయం ఉందా?' అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించారు. మరి అశ్విన్‌ ప్రశ్నకు నిత్యానంద అనుచరులు ఏ విధంగా సమాధానిమిస్తారో వేచిచూడాలి.