శుక్రవారం, 29 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : సోమవారం, 4 మార్చి 2019 (12:14 IST)

2022 ఆసియన్ గేమ్స్‌లో క్రికెట్.. టీమిండియా ఆడుతుందా? లేదా?

2022వ సంవత్సరం జరుగనున్న ఆసియా పోటీల్లో క్రికెట్ పోటీలకు కూడా స్థానం లభించే అవకాశం వున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే కనుక జరిగితే క్రికెట్ ఫ్యాన్స్ ఇక పండగ చేసుకుంటారు. వివరాల్లోకి వెళితే.. 2018వ ఏడాది జరిగిన ఆసియా పోటీల నుంచి క్రికెట్‌ను తొలగించారు. ఈ వ్యవహారం విమర్శలకు తావిచ్చింది. 
 
ఇంకా ఆసియా పోటీల్లో క్రికెట్ పోటీలను జతచేయాలని డిమాండ్ పెరిగిపోతున్న నేపథ్యంలో.. 2022లో జరుగనున్న 19వ ఆసియన్ గేమ్స్‌లో క్రికెట్ పోటీలుంటాయని ఓసీఏ ప్రకటించింది. 
 
ఇంకా ఈ క్రికెట్ పోటీల్లో చైనాలోని హాంగ్జూ నగరంలో జరుగుతాయని, ట్వంటీ-20 ఫార్మాట్‌లో ఈ పోటీలు జరుగుతాయని తెలుస్తోంది. కానీ ఇందులో భారత జట్టు ఆడుతుందా లేదా అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. టీమిండియా క్రికెట్ సిరీస్‌లు వుండటంతో 2022 నాటికి ఆసియా గేమ్స్‌లో భారత్ ఆడే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. 
 
దీనిపై ఓసీఏ అధ్యక్షుడు షేక్ అహ్మద్ మాట్లాడుతూ.. ఆసియన్ గేమ్స్‌లో భారత జట్టును బీసీసీఐ పంపకపోతే క్రికెట్ అభిమానులు నిరాశకు గురవుతారని.. క్రీడాభివృద్ధిని దృష్టిలో పెట్టుకోకుండా కమర్షియల్ హంగుల కోసం, ధనార్జనకు కొన్ని సంస్థలు క్రీడను ఉపయోగించుకుంటున్నాయని బీసీసీఐపై షేక్ దెప్పిపొడిచారు.