శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 10 జనవరి 2020 (12:36 IST)

ధోనీ వన్డేలు కూడా ఆడడేమో : కోచ్ రవిశాస్త్రి

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, జార్ఖండ్ డైనమెట్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్‌పై పలు రకాలైన ఊహాగానాలు వినొస్తున్నాయి. ఇప్పటికే టెస్టులకు గుడ్‌బై చెప్పిన ధోనీ... ట్వంటీ20, వన్డేలకు మాత్రమే పరిమితమయ్యాడు. అయితే, ట్వంటీ20, వన్డేలకు కూడా సరిగా ఆడటం లేదు. 
 
ఈ నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ధోనీ వ్యవహారంపై స్పష్టత ఇచ్చేందుకు తాను స్వయంగా అతనితో మాట్లాడినట్టు చెప్పారు. అయితే, తమ మధ్య జరిగిన సంభాషణలను మీడియాతో పంచుకోలేనని చెప్పాడు. త్వరలోనే వన్డేలకు కూడా ధోనీ స్వస్తి చెప్పే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోందని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు. 
 
ఇకపోతే, వచ్చే ఐపీఎల్ సీజన్ ధోనీకి అత్యంత కీలకమన్నారు. ఈ టోర్నీలో రాణిస్తేనే ఆ తర్వాత జరిగే ఐసీసీ ట్వంటీ20 టోర్నీలో ఆడే అవకాశాలు ఉంటాయని చె్పాడు. అదేసమయంలో ఫిట్నెస్ విషయంలో ధోనీ ఎవరికీ తీసిపోరన్నారు. అందుకే అతన్ని కపిల్ దేవ్‌తో పోల్చినట్టు చెప్పాడు. అలాగనీ, ధోనీ జట్టుకు భారం కాబోడని శాస్త్రి తన మనసులోని మాటను వెల్లడించారు.