బుధవారం, 4 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 14 సెప్టెంబరు 2022 (16:48 IST)

ధోనీ వల్లే నా కెరీర్ నాశనం అయ్యింది.. చెప్పింది ఎవరబ్బా?

singam dhoni
ఎంతటి ప్రతికూల పరిస్థితుల్లోనూ మిస్టర్ కూల్‌గా ఉండి.. నేటితరం క్రికెటర్లకు ఆదర్శంగా నిలిచాడు ధోనీ. అలాంటి ధోనీపై ఓ క్రికెటర్ సంచలన ఆరోపణలు చేశాడు. ధోనీ వల్లే తన కెరీర్ నాశనం అయిందని విమర్శించాడు. ధోనీ తనకు అవకాశాలు ఇచ్చి ఉంటే.. ఇప్పుడు తన కెరీర్ మరోలా ఉండేదని వాపోయాడు.
 
టీమిండియా ఆటగాడు ఈశ్వర్ పాండే అంతర్జాతీయ క్రికెట్‌కు ఫాస్ట్ బౌలర్ ఈశ్వర్ పాండే గుడ్ బై చెప్పాడు. ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడకుండానే రిటైర్మెంట్ ప్రకటించాడు. 2013లో భారత జట్టులోకి వచ్చిన మధ్యప్రదేశ్ క్రికెటర్ ఈశ్వర్ పాండే అన్ని ఫార్మాట్ల నుంచి రిటైరయ్యాడు. 
 
''మహేంద్ర సింగ్ ధోనీ నాకు అవకాశాలు ఇచ్చి ఉంటే.. నా కెరీర్ మరోలా ఉండేది. అప్పుడు నా వయస్సు 23-24 సంవత్సరాలు. ఫిట్‌నెస్ కూడా చాలా బాగుంది. అప్పుడు ధోనీ భాయ్ నాకు టీమ్ ఇండియాలో అవకాశం ఇచ్చి ఉంటే.. నేను నా దేశం కోసం బాగా రాణించేవాడి. 
 
కానీ సరైన అవకాశాలు దక్కలేదు.. అని వాపోయాడు. 2013లో న్యూజిలాండ్ పర్యటనలో ఈశ్వర్ పాండే టెస్టు జట్టులో చోటు సంపాదించాడు. ఆ సమయంలో ధోనీ కెప్టెన్‌గా ఉన్నాడు. కానీ తుది జట్టులో అతడికి అవకాశం దక్కలేదు. ఆ తర్వాత మళ్లీ జట్టులోకి రాలేదు.