ఇంగ్లండ్‌తో టెస్టు.. శతక్కొట్టిన బ్యాటుకు ముద్దెట్టి.. అనుష్క వైపు..

ఇంగ్లండ్‌ జట్టుతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో భాగంగా మూడో టెస్టులో టీమిండియా గెలుపు దిశగా పయనిస్తోంది. ఈ టెస్టులో భారత్ స్కోర్ పెరిగేందుకు కెప్టెన్ విరాట్ కోహ్లీ చేసిన అద్భుత సెంచరీ చాలా ఉపయోగపడింది.

selvi| Last Updated: మంగళవారం, 21 ఆగస్టు 2018 (17:25 IST)
ఇంగ్లండ్‌ జట్టుతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో భాగంగా మూడో టెస్టులో టీమిండియా గెలుపు దిశగా పయనిస్తోంది. ఈ టెస్టులో భారత్ స్కోర్ పెరిగేందుకు కెప్టెన్ విరాట్ కోహ్లీ చేసిన అద్భుత సెంచరీ చాలా ఉపయోగపడింది. అయితే సోషల్ మీడియాలో మాత్రం విరాట్ సెంచరీ కంటే ఆ తర్వాత అతడు చేసుకున్న సంబరాలపైనే ఎక్కువ చర్చ జరుగుతోంది. 
 
ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న టెస్ట్ సీరీస్‌లో మొదటి రెండు టెస్టుల్లో టీమిండియా ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న విషయం తెలిసిందే. అయితే మూడో టెస్టులో మాత్రం టీమిండియా పుంజుకుంది. మూడో టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్‌లో విరాట్ తన అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో సెంచరీ సాధించాడు. కోహ్లీ కెరీర్‌లో ఇది 23వ టెస్టు సెంచరీ. 
 
ఈ సెంచరీ తర్వాత విరాట్ తనదైన స్టైల్‌లో సంబరాలు జరుపుకున్నారు. తన బ్యాట్‌కు ముద్దుపెట్టుకుని గ్యాలరీలోని భార్య వైపు ఆ బ్యాట్‌ను చూపాడు. దీంతో అనుష్క కూడా తెగ సంబరపడిపోయింది. 
 
అయితే కోహ్లీ గతంలో కూడా ఇలా తన భార్యకు గాల్లో ముద్దులు ఇస్తూ సంబరాలు జరుపుకున్నారు. తాజాగా మరోసారి అలాగే సెంచరీ సంబరాలు జరుపుకోవడం, ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై ఫ్యాన్స్ పాజిటివ్‌గా స్పందిస్తున్నారు.దీనిపై మరింత చదవండి :