శనివారం, 30 సెప్టెంబరు 2023
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 3 డిశెంబరు 2021 (10:30 IST)

నేటి నుంచి ముంబై వేదికగా రెండో టెస్ట్.. ఆ ముగ్గురు ఔట్

భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ శుక్రవారం నుంచి ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్ ముంబై వేదికగా జరుగనుంది. అయితే, ఈ టెస్ట్ కోసం భారత్ ప్రకటించిన జట్టులో రహానే, జడేజా, ఇషాంత్ శర్మలను పక్కనపెట్టారు. కాన్పూర్ టెస్టులో ఇషాంత్ శర్మ చేతి వేలికి గాయం కాగా, జడేజాకు కుడిచేతి మడమకు గాయమైంది. 
 
అలాగే, రహానే కూడా కాన్పూరు టెస్ట్ మ్యాచ్‌లోనే తొడ కండరాలు పట్టేశాయి. దీంతో ఈ ముగ్గురిని ముంబై టెస్టు కోసం ఎంపిక చేయలేదు. వారి స్థానాల్లో విరాట్ కోహ్లీ, మహ్మద్ సిరాజ్, జయంత్ యాదవ్‌లకు చోటు కల్పించారు. అలాగే, కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌కు కూడా గాయమైన విషయం తెల్సిందే. 
 
ఇదిలావుంటే, ముంబై పిచ్‌పై తేమ అధికంగా ఉండటంతో మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభంకానుంది. దీనికితోడు వర్షం కురవడం వల్ల పిచ్ చిత్తడిగా మారింది. ఫలితంగా 10.30 గంటలకు ఫీల్డ్ అంపైర్లు మైదానాన్ని పరిశీలించి ఓ నిర్ణయం తీసుకోనున్నారు.