భారతీయుల వాట్సాప్ ఖాతాలు నిలిపివేత!
భారతీయులకు చెందిన రెండు లక్షల ఖాతాలపై వాట్సాప్ యాజమాన్యం వేటువేసింది. అశ్లీల వ్యాప్తి, నకిలీ వార్తల వ్యాప్తి వంటి ఫిర్యాదుల నేపథ్యంలో 2.2 లక్షల మంది భారతీయుల ఖాతాలను నిలిపివేసినట్టు వాట్సాప్ తెలిపింది. ఇతర యూజర్లు అందించిన ఆధారాలు, చేసిన ఫిర్యాదుల ఆధారంగా ఈ చర్య తీసుకున్నట్టు పేర్కొంది.
దీనిపై వాట్సాప్ యాజమాన్యం స్పందిస్తూ, ఒక యూజర్ వాట్సాప్ ఖాతాను ప్రారంభించిన తర్వాత మొదటిసారి రిజిస్ట్రేషన్ ఎపుడు చేశారు. అపుడు వాట్సాప్ ఖాతా ఎలావున్నది? మెసేసింగ్ చేసేటపుడు ఎలావుంది? అనే విషయాలతో పాటు.. ఎవరైనా యూజర్ సదరు ఖాతా గురించి బ్లాక్ రిపోర్టు పంపడం, ఖాతా గురించి మరో యూజర్ రిపోర్టు పంపడం వంటి మూడు అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరణ ఇచ్చింది.