బుధవారం, 27 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 27 డిశెంబరు 2021 (16:51 IST)

సెంచూరియన్ పార్కులో జోరు వర్షం.. రెండో రోజు ఆట వర్షార్పణమేనా?

భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య మూడు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ జరుగుతోంది. ఇందులోభాగంగా, ఈ నెల 26వ తేదీ నుంచి సెంచూరియన్ పార్కులో తొలి టెస్ట్ మ్యాచ్ ఆరంభమైంది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఆట ముగిసే సమయానికి పటిష్ట స్థితిలో నిలిచింది. తొలి రోజున మూడు వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. 
 
సెంచరీ హీరో కేఎల్ రాహుల్ 122 పరుగులు చేయగా, అజింక్యా రహానే 40 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. 248 బంతులు ఎదుర్కొన్న రాహుల్ 16 ఫోర్లు, ఓ సిక్సర్ సాయంతో 122 రన్స్ చేశాడు. సౌతాఫ్రికా బౌలర్లలో లుంగీ ఎంగిడి మూడు వికెట్లు పడగొట్టాడు. 
 
ముఖ్యంగా, భారత ఓపెనర్లు రాహుల్, మయాంక్ అగర్వాల్‌ (60)లు ఓపెనింగ్ భాగస్వామ్యంగా 117 పరుగులు చేశారు. ఆ ర్వాత కెప్టెన్ విరాట్ కోహ్లీ 35 రన్స్ చేసి మూడో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. అయితే పుజార్ మరోమారు డకౌట్ అయ్యాడు. పుజరాతాతో పాటు విమర్శలు ఎదుర్కొన్న రహానే మాత్రం అద్భుతంగా బ్యాటింగ్ చేసి రాణించాడు. ఫలితంగా 81 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో 40 పరుగులు చేసింది. 
 
అయితే, రెండో రోజు ఆటపై వరుణుడి ప్రభావం తీవ్రంగా ఉంది. సెంచూరియన్ పార్కులో ఇప్పటికీ వర్షం కురుస్తూనేవుంది. దాంతో ఒక్క బంతి కూడా పడకుండానే ఇరు జట్లూ లంచ్‌కు వెళ్ళారు. లంచర్ తర్వాత అంపైర్లు మైదానాన్ని మరోమారు పరిశీలించి నిర్ణయించినా అందుకు తగిన అనుకూల వాతావరణం కనిపించడం లేదు. వర్షపు జల్లులు పడుతూనే వున్నాయి.