ఆదివారం, 5 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 12 డిశెంబరు 2023 (14:47 IST)

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు కెప్టెన్సీగా రిషబ్ పంత్

rishabh panth
భారత వికెట్ కీపర్-బ్యాటర్ రిషబ్ పంత్ తిరిగి ఆటలోకి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2024లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు నాయకత్వం వహిస్తాడని తెలుస్తోంది. 
 
ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో శిక్షణ పొందుతున్న పంత్ ఫిబ్రవరి నెలాఖరు నాటికి ఫిట్‌నెస్‌ను తిరిగి పొందే అవకాశం ఉందని ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్‌మెంట్ అధికారులు తెలిపారు.
 
పంత్ బ్యాటింగ్, ఫీల్డింగ్‌పై దృష్టి పెట్టాడు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బిసిసిఐ) అనుమతిస్తేనే వికెట్ కీపింగ్ బాధ్యతలను తీసుకుంటాడని తెలుస్తోంది. అంతకుముందు, పంత్ తిరిగి రావడాన్ని డీసీ జట్టు డైరెక్టర్‌గా ఉన్న భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ధృవీకరించాడు.