శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 3 నవంబరు 2023 (17:58 IST)

శ్రీవారిని దర్శించుకున్న రిషబ్, అక్షర్ పటేల్

Rishabh Pant-Axar Patel
Rishabh Pant-Axar Patel
టీమిండియా క్రికెటర్లు రిషబ్ పంత్, అక్షర్ పటేల్ తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. వీరిని సంప్రదాయబద్ధంగా ఆహ్వానించిన టీటీడీ అధికారులు, వీఐపీ బ్రేక్ సమయంలో దర్శన అవకాశం కల్పించారు. 
 
దర్శనం అనంతరం క్రికెటర్లకు రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనం అందించారు. టీటీడీ వర్గాలు పంత్, అక్షర్ పటేల్‌లకు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశాయి. 
 
కాగా, పంత్, అక్షర్ పటేల్ రాకతో శ్రీవారి ఆలయం ఎదుట కోలాహలం నెలకొంది. వారితో ఫొటోలు దిగేందుకు అభిమానులు ఉత్సాహం ప్రదర్శించారు. అక్షర్ పటేల్ ఇటీవల ఆసియా కప్ సందర్భంగా గాయపడ్డాడు.