సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 23 అక్టోబరు 2023 (12:43 IST)

శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. చక్రస్నానంతో పరిసమాప్తం

chakrasnam
తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన సోమవారం ఉదయం జరిగిన చక్రస్నానంతో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం అయ్యాయి. 
 
సోమవారం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి, స్వామి ప్రతినిధిగా చక్రత్తాళ్వార్‌కు అర్చకులు స్నపన తిరుమంజనం, అభిషేకం నిర్వహించారు. చక్రస్నానం తర్వాత ఆనంద నిలయానికి స్వామివారిని చేర్చారు. 
 
అనంతరం భక్తులు కూడా శ్రీవారి పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు. అంతకుముందు తెల్లవారుజామున 3-6 గంటల సమయంలో వేంకటేశుడికి పల్లకీ, తిరుచ్చి ఉత్సవం నిర్వహించారు.