సోమవారం, 2 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 4 నవంబరు 2022 (13:43 IST)

టీ20 వరల్డ్ కప్ 2022.. జోష్ లిటిల్ అదుర్స్

Josh Little
Josh Little
టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో  టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీ20 వరల్డ్ కప్ 2022లో హ్యాట్రిక్ తీసిన రెండో ఐర్లాండ్ బౌలర్‌గా నిలిచాడు జోషువా లిటిల్. ఇంతకుముందు 2021లో నెదర్లాండ్స్‌ప కుర్టీస్ కాంపర్ హ్యాట్రిక్ తీశాడు. ఓవరాల్‌గా టీ20 వరల్డ్ కప్‌లో హ్యాట్రిక్ తీసిన ఆరో బౌలర్ జోష్ లిటిల్ నిలిచాడు.  
 
ఒకే ఏడాది అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు జోషువా లిటిల్. 2022లో జోష్ లిటిల్ ఇప్పటిదాకా 39 వికెట్లు తీయగా నేపాల్ బౌలర్ సందీప్ లమిచ్ఛానే 38 వికెట్లు  తీశాడు. 
 
ఐర్లాండ్ బౌలర్ జోషువా లిటిల్ హ్యాట్రిక్ సాధించినా కేన్ మామ ఇన్నింగ్స్ కారణంగా న్యూజిలాండ్ జట్టు భారీ స్కోరు చేయగలిగింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు, నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసింది.