సోమవారం, 2 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 15 డిశెంబరు 2022 (11:48 IST)

సంచలన నిర్ణయం తీసుకున్న కేన్ విలియమ్సన్

kane williamson
న్యూజిలాండ్ క్రికెట్ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. పని ఒత్తిడి కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక నుంచి వన్డేలు, టీ20లకు మాత్రమే సారథ్యం వహించేలా ప్లాన్ చేసుకున్నాడు.
 
గత ఆరేళ్ళుగా సారథ్య బాధ్యతలు నిర్వహిస్తున్న విలియమ్సన్... జట్టుకు ఎన్నో అద్భుతమైన విజయాలను అందించాడు. గత 2016ల్ బ్రెండన్ మెక్‌కల్లమ్ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు స్వస్తి చెప్పిన తర్వాత విలియమ్సన్ కెప్టెన్సీ బాధ్యతలను స్వీకరించారు. ఇక విలియమ్సన్ స్థానంలో టెస్టు జట్టుకు టిమ్ సౌథీ నాయకత్వం వహించనున్నారు. 
 
వైస్ కెప్టెన్‌గా జట్టు కీపర్ టాల్ లాథమ్‌ను ఎంపిక చేశారు. కాగా, విలియమ్సన్ మొత్తం 38 టెస్టులు ఆడగా, 22 మ్యాచ్‌లలో జట్టును గెలిపించాడు. 8 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. కేన్ సారథ్యంలోనే గత యేడాది జరిగిన ఐసీసీ టెస్ట్ చాంపియన్ షిప్ ట్రోఫీని కూడా న్యూజిలాండ్ జట్టు సొంతం చేసుకుంది.