ఆదివారం, 10 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 9 నవంబరు 2024 (18:53 IST)

గేమ్ ఛేంజర్ టీజర్ వచ్చేసింది - నేను ఊహకు అందను అంటున్న రామ్ చరణ్

kiyara, charan, SJ surya
kiyara, charan, SJ surya
రామ్ చరణ్, దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో వస్తున్న గేమ్ ఛేంజర్ టీజర్ టక్నోలో కొద్దిసేపటి క్రితమే విడుదలైంది. టీజర్  మొత్తంగా చూస్తే చాలా ఆసక్తిగా సాగింది. రామ్ చరణ్ తండ్రీ కొడుకులుగా కన్పిస్తూ యాక్షన్ సీన్స్ లో మెప్పించారు. తండ్రి అరాచకాలకు ఎదురొడ్డితే కొడుకుగా అంతకంటే ధర్మం కోసం పోరాడుతూ ఎవ్వరికీ చేష్టలు అందనంతగా పనులు చేయడం ఈ టీజర్ సారాంశం.
 
టీజర్ ఎలా వుందంటే..  బేసిగ్గా రామ్ అంతటి మంచోడు లేదు.. కానీ వాడికి కోపం వస్తే వాడంత చెడ్డోడు మరోకడు లేడు. అనే డైలాగ్ లో టీజర్ ఆరంభమైంది. ఇందులో పంచెకట్టు రామ్ చరణ్, కలెక్టర్ రామ్ చరణ్ గా రెండు వేరియేషన్స్ పాత్రలు రిలీవ్ చేశారు. తర్వాత యాక్షన్ ఎపిసోడ్స్, వాలీబాల్ ఆటతో యాక్షన్ సీన్స్ వున్నాయి. కొన్ని యాక్షన్ సీన్స్ తర్వాత చరణ్ రిమోట్ నొక్కగానే హైడ్రాలాగా బిల్డింగ్ లన్నీ కూలిపోతుంటాయి. దాంతో ఏం చేశాడువాడు? అంటూ పొలిటీషియన్, ఎస్.జె. సూర్యలు తన అనుచరులతో గట్టిగా అరవడంతో ఏదో జరుగుతుంది అనిపిస్తుంది. ఆ తర్వాత కొన్ని యాక్షన్ సీన్స్ వస్తుంటాయి. ఐ యామ్ అన్ ప్రెడెక్టబుల్.. అంటూ కుడిచేతితో సైక్ చేయడంతో టీజర్ ముగుస్తుంది. జనవరి  19న సినిమా విడుదలకాబోతుంది.
 
ఈసందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ, లక్నో ఇండియా బడా షెహర్.. ఇక్కడ ప్రజలు దిల్ చాలా బహుత్ బడా.. ఆర్.ఆర్.ఆర్. సినిమా టైంలో ఎంతో అభిమానించారు. ఇక్కడ రిలీజ్ అయితే ఇండియా అంతా తెలుస్తుంది. లక్నో బిగ్ స్టేట్ అందుకే ఇక్కడ ఏర్పాటు చేశాం. శంకర్ సార్ ఎడిటింగ్ పనుల్లో రాలేకపోయారు. నాకు మంచి  సినిమా ఇచ్చారు అని అన్నారు.
 
కియారా అద్వానీ మాట్లాడుతూ,  లక్నో లో టీజర్ విడుదలకావడం చాలా ఆనందంగా వుంది. ఇక్కడే మూడుసార్లు షూటింగ్ జరిగింది. శంకర్ కు ప్రత్యేక ధన్యవాదాలు. ఇది నవాబ్ ల సామ్రాజ్యం. ఇక్కడ రామ్ చరణ్ టీజర్ విడుదల కావడం అద్భుతంగా వుందన్నారు.