శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 11 జనవరి 2018 (12:37 IST)

తండ్రికి తగ్గ తనయుడు... బౌలర్లను చితక్కొడుతున్నాడు

'రాహుల్ ద్రావిడ్. ది వాల్'. భారత క్రికెట్ చరిత్రలో చెరగని ముద్ర వేసిన క్రికెటర్. క్రికెట్‌కు పెట్టని కోటని. జట్టు ఆపదలో ఉన్నపుడు ఆదుకునే ఆపద్బాంధవుడు.

'రాహుల్ ద్రావిడ్. ది వాల్'. భారత క్రికెట్ చరిత్రలో చెరగని ముద్ర వేసిన క్రికెటర్. క్రికెట్‌కు పెట్టని కోటని. జట్టు ఆపదలో ఉన్నపుడు ఆదుకునే ఆపద్బాంధవుడు. టీమిండియాకు చిరస్మరణీయమైన విజయాలను అందించిన క్రికెట్ దిగ్గజం. అందుకే అభిమానులు "గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియన్ క్రికెట్"గా పిలుచుకుంటారు.
 
ద్రావిడ్‌లాగే అతని కొడుకు సమిత్ కూడా క్రికెట్‌లో రాణిస్తున్నాడు. తండ్రికి తగ్గ తనయుడిగా నిలుస్తున్నాడు. కర్ణాటక క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన బీటీఆర్‌ కప్‌ అండర్‌-14 ఇంటర్ స్కూల్ టోర్నీలో సమిత్‌ సెంచరీ (150) కొట్టి అందరినీ ఆకట్టుకున్నాడు. వివేకానంద స్కూల్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో ఈ స్కోర్ చేశాడు. 
 
మాజీ స్పిన్నర్‌ సునీల్‌ జోషి తనయుడు ఆర్యన్‌ (154) కూడా మ్యాచ్‌ విన్నింగ్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. సమిత్‌-ఆర్యన్‌ కదం తొక్కడంతో మాల్యా స్కూల్‌ 50 ఓవర్లలో 500 పరుగుల భారీ స్కోరు చేసింది. ప్రతిగా వివేకానంద స్కూల్‌ 88 పరుగులకే కుప్పకూలింది.
 
ఈ టోర్నీలో మాత్రమే కాదు… అండర్ – 12 టోర్నీల్లోను ద్రావిడ్ వారసుడు… పరుగుల వర్షం కురిపించాడు. బెస్ట్ బ్యాట్స్ మెన్ గా అవార్డు కూడా అందుకున్నాడు. తిరుగులేని ప్రదర్శనతో కర్ణాటక బాలల క్రికెట్‌లో చిచ్చురపిడుగు అనిపించుకుంటున్నాడు.