ఆదివారం, 26 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 17 జనవరి 2023 (11:17 IST)

వాళ్ళిద్దరికీ నేను ఎప్పటికీ రుణపడివుంటా : రిషబ్ పంత్

rishabh pant
గత డిసెంబరు నెలలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదం నుంచి భారత క్రికెట్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. స్వయంగా తాను డ్రైవింగ్ చేస్తూ వచ్చిన కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా కాలిపోయింది. అయితే, కారులో చిక్కుకుని పోయిన రిషబ్ పంత్‌ను అద్దాలు పగులగొట్టి ఇద్దరు యువకులు బయటకు తీసి, ఆ తర్వాత ఆస్పత్రికి తరలించారు. పంత్ కారులో తమకు దొరికిన రూ.4 వేల నగదును ఆ యువకులు తిరిగి ఇచ్చేసి తమ నిజాయితీని చాటుకున్నారు. ఆ యువకులు సోమవారం పంత్‌ను ఢిల్లీ ఆస్పత్రిలో పరామర్శించారు. దీనిపై స్పందించారు. 
 
"నేను ప్రతి ఒక్కరినీ వ్యక్తిగతంగా కలిసి కృతజ్ఞతలు చెప్పలేకపోవచ్చు. కానీ ఈ ఇద్దరు హీరోలకు నేను తప్పకుండా కృతజ్ఞతలు చెప్పాలి. ప్రమాదం జరిగిన తర్వాత వారిద్దరూ ఎంతో సాయపడ్డారు. నేను సకాలంలో సురక్షితంగా ఆస్పత్రికి చేరడంలో వాళ్ల సహకారం మరువలేనిది. రజత్ కుమార్, నిషు కుమార్‌.. మీ ఇద్దరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీకు ఎప్పటికీ రుణపడివుంటాను" అంటూ భోవోద్వేగభరితమైన ట్వీట్‌ను రిషబ్ పంత్ చేశాడు.