బుధవారం, 22 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్

తనకు సాయం చేసిన వారికి థ్యాంక్స్ చెప్పిన రిషబ్ పంత్

rishabh pant
రోడ్డు ప్రమాదంలో గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న తనకు సాయం చేసిన ఇద్దరు వ్యక్తులకు భారత క్రికెట్ జట్టు వికెట్ కీపర్ రిషబ్ పంత్ స్వయంగా థ్యాంక్స్ చెప్పారు. ఈ రోడ్డు ప్రమాదంలో రిషబ్‌కు సాయపడటమే కాకుండా రిషబ్ పోగొట్టున్న వస్తువులను సేకరించి, వాటిని తిరిగి ఇచ్చేందుకు ఆస్పత్రికి ఆ ఇద్దరు వ్యక్తులైన రజత్ కుమార్, నిషు కుమార్‌లు వచ్చారు. 
 
వారు వచ్చిన విషయం తెలుసుకున్న రిషబ్ వారిని తాను చికత్స పొందుతున్న గదికి పిలిచి కృతజ్ఞతలు తెలిపారు. ఆ సమయంలో తీసిన ఓ ఫోటోలో రిషబ్ చేయి కనిపిస్తుంది. ఇందులో రిషబ్ ముఖం కనిపించనప్పటికీ ఆయన ఫ్యాన్స్ మాత్రం ఈ ఫోటను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తమ అభిమాన ఆటగాడు త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. 
 
కాగా, డిసెంబరు 31వ తేదీ జరిగిన రోడ్డు ప్రమాదంలో రిషబ్ తీవ్రంగా గాయపడిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆయన డెహ్రాడూన్‌లోని మ్యాక్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పలు ఆపరేషన్ల తర్వాత ఐసీయూ వార్డు నుంచి ప్రత్యేక వార్డుకు మార్చారు.